ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

భద్రాచలం ఆటా ఇటా?



భద్రాచలం ఆటా ఇటా?
నూర్ బాషా రహంతుల్లా 9948878833


ఏమిటీ భద్రాచలం చరిత్ర ?
1953 
అక్టోబర్ 1న ఖమ్మం మెట్టు జిల్లా అవతరించింది. దీంట్లో ఖమ్మం మెట్టుమధిరఇల్లందుపాల్వంచ,బూర్గంపాడు అనే తాలూకాలుండేవి. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసారు .అప్పుడున్న హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసారు.ఔరంగాబాద్,బీడ్,నాందేడ్, పర్భాని ,ఉస్మానాబాద్ అనే 5 జిల్లాలను మహరాష్ట్ర లో కలిపారు.బీదర్,గుల్బర్గా,రాయచూర్ అనే 3 జిల్లాలను కర్ణాటక లో కలిపారు."మిగిలిన 8 జిల్లాల తెలంగాణా"ను అప్పటి ఆంధ్రరాష్ట్రంతో కలిపారు. అందులో భద్రాచలం లేదు. భద్రాచలం డివిజన్ 1959 దాకా తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా వుండింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం 1959లో పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం జిల్లాను విస్తరించారు. అప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలంనూగూరు అనే రెండు తాలూకాలను ఖమ్మం జిల్లాలో కలిపారు.  కూనవరం,వరరామ చంద్రాపురం,చింతూరు,దుమ్ముగూడెం,చర్ల,వెంకటాపురం,వాజేడు అనే 8 మండలాలకి ఇప్పుడు డివిజన్ కేంద్రం భద్రాచలం1959లో ఈ ప్రాంతం తెలంగాణలో విలీనమైనా 1972 వరకు ముల్కీ హక్కుపొందలేకపోయారు. 

కోయదొరలుకొండరెడ్లుగొత్తికోయలుశబరులుగోండులువాల్మీకులుదొమ్మరులుకాటికాపరులు,చెంచులుపరికముగ్గులవాళ్ళుపిచ్చుకగుంట్లుబుడబుక్కలుప్రధానులుపెద్దమ్మల వాళ్ళుతోటీలుపలు గిరిజన తెగలకు చెందిన వారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తారు.  

ఒడిషా,చత్తిస్ ఘఢ్ రాష్ట్రాల సరిహద్దులు చాలా దగ్గరగా ఉండడం వల్ల అక్కడి చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు వైద్య మరియు ఇతర సేవల కోసం ,ఆలయ సందర్శనార్ధం ఇక్కడికి వస్తుంటారు.భద్రాచలం విద్యార్ధులు కాకతీయ యూనివర్సిటికి వెళితే భాషలోని కోస్తాదనం చూసి మీరు ఆంధ్రా వాళ్ళు కదా అంటారు.కోస్తా జిల్లాలకి వెళితే మీరు ఖమ్మం జిల్లా వాళ్ళు కదా అంటే తెలంగాణా వాళ్ళేగా అంటారు.అదీ పరిస్థితి.

కేసీయార్ ఒకనాటి వివరణ
           "1956
నవంబర్ 1 కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం.1956 నవంబర్ 1 న రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్.ఇప్పుడు మేమడుగుతున్నది 1956 కి ముందు ఉన్న మా రాష్ట్రం.అప్పటి రాష్ట్రం లో ఒక్క ఇంచ్ తక్కువైనా ఊరుకోం.ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్ కూడా మాకు అక్కరలేదు.గీ భద్రాచలం ముచ్చట నాకు ముందే దెల్సు. మా జయశంకర్ గారి ని ఇది వరకే అడిగిన... సార్, ఏంది గీ భద్రాచలం ముచ్చట ..దీని కత ఏందీ..కార్ఖానా ఏందీ అని....దానికి ఆయన....అంటే ..ప్చ్..అది..ఆయన ...ప్రొపెసరు కదా.. యెంటనే ..చాలా చక్కగా...గిట్లన్నడు....1956 కి ముందు రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్..two independent states గీ రెండూ.. గీ తెలంగాణా అప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రం..మాగ్గావల్సింది గా ప్రత్యేక రాష్ట్రమే..గదే రాష్ట్రం గట్లనే గావాలే ఇప్పుడు... అంతకు మించి ఒక్క ఇంచ్ మాకక్కరలేదు ఆంధ్రోళ్ళ నుండి..మేము కూడా అప్పటి మా రాష్ట్రం లో ఇంచ్ కూడా వదులుకోం..ఇక ఆ రాష్ట్రంల గీ భద్రాచలం ఉంటద, ఊడుతద..గిదంత మాకు దెల్వది." .

ఎందుకీ గొడవ?
తెలంగాణా లో కలవడం వల్ల కొన్ని లాభాలు వుంటాయని గ్రహించిన కొందరు భద్రాచలంను ఆంధ్రాలో కలపటానికి వీల్లేదనీ తెలంగాణాలోనే ఉంచాలనీ కోరుతున్నారు.  

ఆసియా ఖండం లోనే అత్యంత పెద్దదిగా పరిగణింపబడే భద్రాచలం పేపర్ బోర్డ్స్ వల్ల భద్రాచలం కొద్దిగా అభివృద్ది పొందింది.వాస్తవానికి భద్రాచలానికి  జిల్లా కేంద్రం కావలసిన  అన్నీ అర్హతలూ ఉన్నాయి.భద్రాచలం నుండి వాజేడు ,చితూరుల మీదుగా ఖమ్మం అనేక ప్రయాసలకోర్చి వెళ్ళవలసి వుంటుంది.వర్షాకాలం లోనైతే ఇక భాదలు చెప్పనలవి కాదు.గ్రామాల నుండి వెళ్ళే వారిలో ఎక్కువగా నిరుపేద గిరిజనులే..!తెలంగాణా ఏర్పాటయ్యాక 24 జిల్లాలుగా విడగొడతామని టి.ఆర్.ఎస్.చేసిన వాగ్దానంలో భద్రాచలం కొత్త జిల్లా కూడా ఒకటి.

భద్రాచలం రోడ్ గా పిలువబడే రైల్వే స్టేషన్ ఇక్కడికి 40 కి.మీ.దూరంలోనున్న కొత్తగూడెం లో ఉంది. కీ.శే.పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం(1946)లో కొవ్వూరు-భద్రాచలం అనే కొత్త రైలు మార్గాన్ని కోరారు. అది నేటికీ నెరవేరలేదు. భద్రాచలానికి  రైలు మార్గమేర్పడితే మరో తిరుపతి లాగా భద్రాచలం మారుతుంది.  
తెలంగాణా ప్రజల భయాలేమీటీ?
1986లో గోదావరి వరదలలో భద్రాచలం ఏజెన్సీ, భద్రాచలం పట్టణ ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి.ప్రమాదం నుంచి బయటపడేందుకు గోదావరినదికి కరకట్ట నిర్మించారు. జాతీయ ప్రాజెక్టు హోదాతో  పోలవరం 150 అడుగుల ఎత్తులో నిర్మాణం జరిగితే నిత్యం గోదావరిలో 50 అడుగుల లోతు 30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుంది. ఎప్పుడూ రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహిస్తుంది. వరదలొస్తాయి.   భద్రాచలంతో పాటు, పరిసర ప్రాంతాలకు పూర్తిగా రహదారి సౌకర్యం నిలిచిపోతుంది. ఏజెన్సీ ప్రాంతం మొత్తం పూర్తిగా నీట మునిగిపోయే ప్రమాదం ఉంది. 278 గ్రామాలు నీట మునుగుతాయి. లక్ష ఎకరాల పంట పొలాలు మునిగిపోతాయి. భారీగా అటవీ ప్రాంతం కూడా కనుమరుగవుతుంది. ప్రస్తుతం భద్రాచలం ఏజెన్సీ వాసులు, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల మీదుగా వయా మారేడిమిల్లి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెడతారు. పోలవరం నిర్మాణం జరిగితే ఈ మండలాలన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోతాయి. శబరి నదిపై ఉన్న బ్రిడ్జిలు ఎప్పుడూ నీటిలోనే మునిగి ఉంటాయి. మొత్తంగా గోదావరి ఒడ్డు నుంచి ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు కుంట వరకు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంచెత్తుతుంది. శబరి ఎగపోటుతో నిత్యం 50 అడుగులకుపైగా నీరు ప్రవహిస్తుంటుంది. జాతీయ రహదారి, భద్రాచలం నుంచి మారేడుమిల్లి రహదారి పూర్తిగా నీటమునుగుతుంది. దీంతో భద్రాచలం వాసులు ఆంధ్ర ప్రాంతంలోని రాజమండ్రికి వెళ్లాలంటే తెలంగాణ ప్రాంతంలోని పాల్వంచ, సత్తుపల్లి మీదుగా రాజమండ్రికి చేరుకోవాల్సి ఉంటుంది. దీనికోసం 230 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాలి. అటు కృష్ణా జిల్లా తిరువూరు వెళ్లాలన్నా బంజర మీదుగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప చేరుకోలేరు.అందువలన భద్రాచలం తెలంగాణాలో ఉంటేనే అన్ని విధాలా మేలని తెలంగాణ నేతలు అంటున్నారు.
అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి  వాదన
1959లో ఖమ్మం జిల్లాలో కలిసిన భద్రాచలం మాది అంటున్న వారు 1956 లోనే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఏర్పడిన హైదరాబాద్‌పై మాకు హక్కు లేదని ఎలా అంటారు?  స్వాతంత్రానికి ముందు చరిత్రను తీసుకొని హైదరాబాద్‌ తెలంగాణాది అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలం రెవిన్యూ డివిజన్‌ను 1959లో ఖమ్మం జిల్లాలో కలిపారు. కానీ కర్నూలును త్యాగం చేసుకొని 1956లోనే హైదరాబాద్‌ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. 56లో ఏర్పడిన హైదరాబాద్‌పై మాకు హక్కులేదంటే 59లో కలిసిన భద్రాచలంపై మీకు హక్కు ఎక్కడి నుంచి వస్తుంది?. భద్రాచలంపై మీకు నిజంగా హక్కు వచ్చి ఉంటే... కర్నూలును త్యాగం చేసుకొని 56లోనే సమైక్య రాష్ట్ర రాజధానిగా ఏర్పడిన హైదరాబాద్‌పై మాకెందుకు హక్కు ఉండదు?. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో రాయచూరు జిల్లాలోని అలంపూరు, గద్వాల్‌ తాలూకాలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలిశాయి. అవన్నీ మీ హక్కు అనుకున్నప్పుడు రాజధానిపై మాకు హక్కు లేదంటే ఎలా ఒప్పుకుంటాం?హైదరాబాద్‌ను రాజధానిగా చేయడానికే కర్నూలును త్యాగం చేశాం. సమైక్య రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాలయాలు, పరిశ్రమలపై మాకు అన్ని రకాలా హక్కుంది. హైదరాబాద్‌, నదీ జలాల సమస్యకు పరిష్కారం చూపకుండా ఏకపక్షంగా విభజన ప్రకటిస్తే ఒప్పుకొనే ప్రసక్తేలేదు.ఒకప్పుడు ఢిల్లీ ఉత్తరప్రదేశ్‌లో ఉండింది కాబట్టి ఇప్పుడు మాకిచ్చేయమని ఆ రాష్ట్రం వాళ్లు అడిగితే ఇస్తారా? ''

హైదరాబాదు భద్రాచలం రెండూ కావాలా?
తెలంగాణాలో కొందరు నాయకుల స్వరం మారింది.ఇన్నాళ్ళ అనుబంధం ఎలా వాదులుకుంటామనే ప్రశ్నతో హైదరాబాదుతో పాటు భద్రాచలాన్నికూడా తెలంగాణాలోనే ఉంచాలని కోరుతున్నారు. ఇదే అనుబంధం హైదరాబాదుతో మాకూ ఉంది కాబట్టి హైదరాబాదుపై  మాకూ హక్కు ఉండాలని ఆంధ్ర నాయకులు అడుగుతున్నారు.ఇప్పుడీ వివాదాన్ని కేంద్రం ఎలా తేలుస్తుందో వేచి చూడాలి.

 http://www.suryaa.com/opinion/edit-page/article-154660

 https://www.facebook.com/photo.php?fbid=639335806098413&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater
 

1 కామెంట్‌: